ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా?

ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి( BJP ) పరాజయం తప్పలేదు.

గడచిన పదేళ్ల కాలంలో ఈ స్థాయి పరాజయం చవిచూసిందే లేదు.గతంలో కర్ణాటకలో బీజేపీ రెండు సార్లు అధికారాన్ని దక్కించుకుంది.

కనుక కచ్చితంగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందబోతుంది అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

కానీ తీరా కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం దక్కింది.సొంతంగానే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంను దక్కించుకోవడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ యొక్క రాజకీయ వ్యూహం మారే అవకాశాలు ఉన్నాయి.

ఒంటరిగా వెళ్లాలి అని లేదంటే తమకు ప్రాముఖ్యత ఇచ్చే పార్టీలతో మాత్రమే వెళ్లాలి అంటూ ఇన్నాళ్లు భావించిన బీజేపీ రాజకీయ వ్యూహం మార్చింది.

"""/" / వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మార్చాలని బీజేపీ భావిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీతో( Janasena ) కలిసి వెళ్తే ఎంత వరకు పార్లమెంటు స్థానాలు దక్కుతాయో తెలియదు.

కనుక వైకాపా తో( YCP ) బీజేపీ కలిసి వెళ్లడం వల్ల అత్యధిక సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

"""/" / ప్రస్తుతానికి బీజేపీ మరియు జనసేన పార్టీ లు పొత్తులో ఉన్నాయి.

కానీ ముందు ముందు ఏమైనా జరగవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని తెలుగు దేశం పార్టీ తో జత కడితే కచ్చితంగా బీజేపీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.

అదే జరిగితే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మార్చి వైకాపా మరియు బీజేపీ లు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!