బాలినేని ఆ పార్టీలో చేరుతున్నారా ? వైసీపీ కి బై బై చెప్పేస్తారా ?
TeluguStop.com
ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో( General Election ) ఊహించని ఫలితాలు వెలబడ్డాయి.
అధికార పార్టీగా ఉన్న వైసిపి ( YCP )కి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కడంతో టిడిపి అధికారంలోకి వచ్చింది.
వైసీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టిడిపి జెండా ఎగిరింది.అసలు ఈ స్థాయి ఫలితాలు వస్తాయని వైసిపి అంచనా వేయలేకపోయింది.
మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకంతో వైసీపీ అధినేత జగన్ ధీమా గా ఉంటూ వచ్చారు.
కానీ ఫలితం తారుమారు అయింది.ఇది ఇలా ఉంటే టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో , వైసీపీలోని అసంతృప్త నాయకులు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే వైసిపి లోని కీలక నేతలందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు టిడిపి , జనసేన, బిజెపి లు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
దీనిలో భాగంగానే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( MLA Balineni Srinivas Reddy )వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
"""/" /
ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన లో చేరే అవకాశం ఉన్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది .
అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ బాలినేని ట్వీట్ చేశారు.
హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం హర్షనీయం అని బాలినేని ప్రశంసించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యలకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొందని బాలినేని చెప్పారు .
"""/" /
ఒంగోలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు, అనుచరులపై వేధింపుల గురించి స్పందించాలని కోరుకుంటున్నానని బాలినేని అన్నారు ఎమ్మెల్యేగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేదని వివరించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్ధన్ పై 34 వేల కు పైగా ఓట్ల తేడాతో బాలినేని ఓటమి చెందారు.
అసలు ఎన్నికలకు ముందే బాలినేని వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది .
జగన్ తనను పూర్తిగా పక్కన పెట్టారని బాలినేని అసంతృప్తితో ఉంటూనే వచ్చారు.అయితే తాడేపల్లికి పిలిపించుకుని జగన్ బుజ్జగించి ఒంగోలు టేకెన్ ను కేటాయించారు.
అయినా బాలినేని అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడం, తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జనసేనలో ఆయన చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీ, కాఫీ బదులు ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది!