అఖండ 2 లో బాలయ్య త్రిబుల్ రోల్ లో నటిస్తున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.
ఎందుకంటే ఆయన బాలయ్య బాబుతో చేసిన సినిమాలు వరుసగా భారీ సక్సెస్ లను సాధించాయి.
నిజానికి బాలయ్య బాబు కెరీర్ ను నిలబెట్టిన దర్శకులలో బోయపాటి శ్రీను మొదటి స్థానంలో ఉంటాడు.
ఆయన కనక బాలయ్య బాబుకి ( Balayya Babu )ఇలాంటి సినిమాలను అందివ్వకపోతే బాలయ్య కెరియర్ ఇప్పటివరకు గాడి తప్పేదనే చెప్పాలి.
"""/" /
బాలయ్య బాబుకి వరుస ప్లాప్ లు వస్తున్న సమయంలో సింహా, లెజెండ్, అఖండ లాంటి భారీ సక్సెస్ లను అందించిన ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పుడు బాలయ్య తో 'అఖండ 2'( Akhanda 2 ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు ట్రిపుల్ రోల్ లో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాని కూడా మాస్ మసాలా సినిమాలా రూపొందించి భారీ సక్సెస్ ని సాధించాలని బోయపాటి చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ఆయన త్రిబుల్ రోల్ లో నటిస్తున్నాడు.ఇక బాలయ్య ఈ సినిమాలో త్రిపుల్ రోల్ లో నటించి ప్రేక్షకులందరిని ఆనందపడేలా చేయబోతున్నాడు.
నిజానికి అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక తను ఇంతకుముందు రామ్ తో చేసిన స్కంద సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.
"""/" /
కాబట్టి ఇప్పుడు సక్సెస్ ని సాధించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే బాలయ్య బాబు తో సినిమా చేస్తేనే బోయపాటికి కూడా భారీ సక్సెస్ దక్కుతుందని ఇండస్ట్రీలో అందరూ నమ్ముతున్నారు.
చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది.
అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. మాధవీలత షాకింగ్ కామెంట్స్ వైరల్!