అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్న ఆ ప‌ని చేస్తాడా !

అవును! ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా.ఇదే మాట వినిపిస్తోంది.

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, టెక్క‌లి ఎమ్మెల్యే కింజ‌రాపు అచ్చెన్నాయుడు త‌న విశ్వ‌రూపం చూపిస్తార‌ని అంటున్నారు.

సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల తొలి రోజునే ఆయ‌న ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో అనేక కీల‌క ప‌రిణామాలు జ‌ర‌గ‌నున్నాయి.వీటిలో ప్ర‌ధానంగా గ‌త స‌మావేశాల వ‌ర‌కు కేవ‌లం టీడీఎల్పీ ఉప నేత‌గా ఉన్న అచ్చెన్న ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు.

సో ఆయ‌న వ్య‌వ‌హార శైలికి గతానిక‌న్న భిన్నంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఈ ఒక్క అసెంబ్లీ స‌మావేశాల్లో మాత్ర‌మే కాదు.

ఇక‌పై జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ఆయ‌న పోరాటం ఎలా ?  ఉంటుంద‌న్న‌దే ఆస‌క్తిగా ఉంది.

అంతేకాదు గ‌త సమావేశాల‌కు ఇప్పుడు జ‌రుగుతున్న స‌మావేశాల‌కు మ‌ధ్య‌లో ఈఎస్ ఐ మందుల కొనుగోలుకు సంబంధించిన కుంభ‌కోణంలో అచ్చెన్న కుట్ర‌కు పాల్ప‌డ్డారంటూ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

దీంతో సుమారు రెండున్న‌ర నెల‌ల పాటు అచ్చెన్న స్వేచ్ఛ‌ను కోల్పోయి కొన్నాళ్లు జైల్లో ఉండాల్సి వ‌చ్చింది.

ఇక‌, ఆయ‌న‌కు అనారోగ్యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాధికారులు లెక్క చేయ‌లేదు.దీంతో అచ్చెన్న న‌ర‌క యాత‌న ప‌డ్డారు.

అయితే స‌ద‌రు కేసులో అచ్చెన్న ప్ర‌మేయం లేద‌ని అధికారులు తేల్చేశారు. """/"/ ఇప్పుడు టీడీపీ నిర్దేశించుకున్న 20 అంశాల‌కు తోడు త‌‌న‌పై వ్య‌క్తిగ‌తంగా వైసీపీ చేసిన దాడిని, జైలుకు పంపించిన విధానంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అచ్చెన్న తాజా స‌భ‌ల్లో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం మెండుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే తొలి రోజే చంద్ర‌బాబు, అచ్చెన్న‌తో స‌హా 12 మంది ఎమ్మెల్యేలు స‌భ నుంచి స‌స్పెండ్ అవ్వ‌డంతో స‌భ ర‌క్తిక‌ట్ట‌లేదు.

నిజానికి నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హరించే అచ్చెన్న ఏ స‌మ‌స్య‌నైనా ప్ర‌శ్న‌నైనా అంశాన్న‌యినా సూటిగా వ్య‌హ‌రించి స‌భ‌లో సంధిస్తార‌ని ఆయ‌న‌కు స‌మాధానం చెప్ప‌లేక కొంద‌రు మంత్రులు బాడీ లాంగ్వేజ్‌పై సటైర్లు వేయ‌డం తెలిసిందే.

సాక్షాత్తు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా అచ్చెన్న‌పై కామెంట్లు చేశారు.కానీ, ఇప్పుడు మాత్రం అచ్చెన్న ఎవ‌రినీ వ‌దిలి పెట్టేప్ర‌శ్నే లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలు..: జగదీశ్ రెడ్డి