బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడా..? శివాజీ మాఫియా ని బయటపెట్టే కంటెస్టెంట్స్ లేరా!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ మొత్తం బూతులతో నిండిపోయింది.ముఖ్యంగా భోలే శవాలీ( Bhole Shavali ) అనే వ్యక్తి వచ్చినప్పటి నుండి ఇది తారా స్థాయికి చేరుకుంది.

అతనికి తోడు వెనుక శివాజీ కూడా తోడు అయ్యాడు.స్టార్ మా సీరియల్ బ్యాచ్ మీద 24 గంటలు వీళ్ళతో కూర్చొని ఆరోపణలు చెయ్యడమే శివాజీ కి అలవాటు అయ్యింది.

మాటికొస్తే జనం చూస్తున్నారు ఎవరు గ్రూప్స్ ని మైంటైన్ చేస్తున్నారో వాళ్లకి తెలుసు అని అంటూ ఉంటాడు.

కానీ వెనుక చేరి ఇలా ఇతర కంటెస్టెంట్స్ ని ప్రభావితం చెయ్యడం శివాజీ కి బాగా అలవాటు అయిపోయింది.

ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరిని తన గ్రూప్ లోకి తీసుకొని స్టార్ మా బ్యాచ్ మీద నెగటివిటీ పెంచాలని చూస్తున్నాడు.

అలాగే చేస్తున్నాడు కూడా.ఇతని మాఫియా ని బయటపెట్టే కంటెస్టెంట్ గా కచ్చితంగా అర్జున్( Arjun ) నిలుస్తాడని అందరూ అనుకున్నారు.

"""/" / కానీ అర్జున్ కూడా సేఫ్ గా తన గేమ్ ని ఆడుతున్నాడు.

ఇప్పటి వరకు శివాజీ తో ఆయనకీ ఎలాంటి సమస్య రాలేదు.పైగా శివాజీ తో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాడు.

ఇతను శివాజీ కి పోటీ అవుతాడని అందరూ అనుకుంటుంటే, ఇతను కూడా శివాజీ భజన బృందం లో చేరిపోతాడేమో అని ఆడియన్స్ కి అనిపిస్తుంది.

మరోపక్క అమర్ దీప్( Amardeep ) శివాజీ ఎన్ని మాటలు తనని అన్నా పడుతున్నాడు.

నీ ఆటని చూస్తే జనాలు నవ్వుతారు రా అన్నప్పుడు కానీ, నేను చనిపోయే ముందు కూడా నా పిల్లలకు చెప్తాను, నిన్ను మాత్రం నమ్మొద్దు లాంటి బలమైన పదజాలం ఉపయోగించినప్పుడు కానీ అమర్ దీప్ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు.

నిన్న శివాజీ ని ఈ రీజన్ చెప్పి నామినేట్ చేసినప్పుడు కూడా అమర్ దీప్ లో ఫైర్ లేదు.

శివాజీ అప్పుడు కూడా అమర్ ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసాడు. """/" / ఇలా ఒక్కరు కూడా శివాజీ మాఫియా ని బయటపెట్టలేకపోతున్నారు.

ఎదో ఒకరోజు అమర్ దీప్ ఫైర్ అవుతాడు, కచ్చితంగా శివాజీ ఆట తీరుని మొత్తం బయటపెడుతాడని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం అమర్ దీప్ గ్రాఫ్ టాప్ 5 లో ఒక స్థానం నుండి టాప్ 1 రేంజ్ కి వెళ్తుంది.

ఇక ఆయన ఆట తీరుని కూడా ఇంకా వేగవంతం చేస్తే టైటిల్ ఇతనికే అని ఫిక్స్ అయిపోవచ్చు.

కానీ ప్రతీ టాస్కులోను అమర్ దీప్ తన బెస్ట్ ని ఇస్తున్నాడు కానీ, గెలవలేకపోతున్నాడు.

మరోపక్క శివాజీ సపోర్టు చేసే పల్లవి ప్రశాంత్ మరియు యావర్ మాత్రం ప్రతీ టాస్కుని గెలుస్తున్నారు.

ఇదొక్కటి మారితే అమర్ దీప్ గ్రాఫ్ ఊహించని విధంగా మారుతుంది.

అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?