‘పుష్ప 2’ సర్ప్రైజ్ ట్రీట్ ఆ రోజే.. పార్ట్ 1 ను ఫాలో అవుతున్న సుక్కూ!
TeluguStop.com
పుష్ప 2.ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప పార్ట్ 1 భారీ లాభాలను తెచ్చి పెట్టింది.
పార్ట్ 1 170 కోట్లతో తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 380 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
దీంతో నిర్మాతలు బాగా లాభపడ్డారు.ఇక ఈ సినిమా సీక్వెల్ మీద ఉన్న అంచనాలను చూసి ఈసారి దాదాపు 400 కోట్లతో నిర్మిస్తున్నారని సమాచారం.
మరి ఇటీవలే ఈ సినిమా పార్ట్ 2 షూట్ గ్రాండ్ గా వైజాగ్ లో స్టార్ట్ చేసి అక్కడ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు.
"""/" /
ఇక రెండవ షెడ్యూల్ ఫిలిం సిటీలో స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ చేస్తున్నారు.
మరి షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.పుష్ప 2 అప్డేట్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.
పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా ట్రీట్ ఎప్పుడు రాబోతుంది అనే దానిపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
"""/" /
ఈ అప్డేట్ ని పార్ట్ 1 కి ఎలా అయితే ఇచ్చారో అదే ఫాలో అవుతున్నాడు సుకుమార్.
పార్ట్ 1 ఫస్ట్ లుక్ లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ లో అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన విషయం విదితమే.
ఇక ఇప్పుడు కూడా దీనినే ఫాలో అవుతూ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా పార్ట్ 2 నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.
మరి ఈ స్పెషల్ ట్రీట్ కోసం కొద్దీ రోజులు ఎదురు చూడాల్సిందే.
యాక్టింగ్ వదిలేయాలనుకుంటే భార్య మాటలే నిలబెట్టాయి.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్!