అక్కినేని ఫ్యామిలీ కోరికను అఖిల్ తీరుస్తాడా..!

అక్కినేని హీరోలకు మాస్ ఇమేజ్ ఎంత ట్రై చేస్తున్న కూడా రావడం లేదు.

ఏఎన్నార్ వేసిన క్లాస్ అనే పునాది పైనే నాగార్జున నడిచాడు.ఇప్పుడు ఆయన వారసులు కూడా అదే బాటలో నడుస్తున్నారు.

నాగార్జున ఆయన కుమారులను అయినా మాస్ బాటలో నడిపిద్దాం అనుకున్నారు.కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

నాగ చైతన్య మొదటి సినిమా జోష్ తోనే మాస్ సినిమా ట్రై చేసాడు.

కానీ అది ప్లాప్ అయ్యింది.ఆ తర్వాత బెజవాడ, ఆటో నగర్ సూర్య, తఢాఖ, దడ వంటి సినిమాలు చేసిన అన్ని ప్లాప్స్ అయ్యాయి.

దీంతో నాగ చైతన్య కూడా పూర్తిగా క్లాస్ సినిమాల వైపే అడుగులు వేసాడు.

యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నాడు నాగ చైతన్య.మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి వరుస సినిమాలు హిట్ అవ్వడంతో నాగ చైతన్య ఇమేజ్ కూడా పెరిగింది.

ఇప్పుడు ప్రెసెంట్ చైతూ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.

"""/"/ ఈ సినిమా కూడా క్లాస్ సినిమాగానే తెరకెక్కిస్తున్నాడు విక్రమ్.ఈ రకంగా చైతన్య సేఫ్ జోన్ లో సినిమాలు చేస్తూ ఉన్నాడు.

ఇక ఆ తర్వాత అఖిల్ కూడా ఇప్పటి వరకు మాస సబ్జెక్టు ను టచ్ చేయలేదు.

అన్ని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించే విధంగానే సినిమాలు చేస్తున్నాడు అఖిల్.

"""/"/ హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు అన్ని కూడా యూత్ టార్గెట్ గా రిలీజ్ అయినవే.

అయితే అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఇది స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

సురేందర్ రెడ్డి సినిమా అంటే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తారు.మరి ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ ఆశిస్తున్న మాస్ ఇమేజ్ కోరికను అఖిల్ నెరవేరుస్తాడో లేదో చూడాలి.

‘నో ఫ్లై ’ లిస్టులో పేరు .. భారత సంతతి సిక్కు కార్యకర్తలకు కెనడా కోర్టులో చుక్కెదురు