రాబోయే సినిమాతో అఖిల్ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి( Akkineni Family ) చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.
ఇక వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ ( Akkineni Akhil )గురించి ప్రత్యేకమైన చర్చ అయితే జరుగుతుంది.
ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయనకు ఎలాంటి సక్సెస్ అయితే తగ్గలేదు.
మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
"""/" /
ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమా మీద సరైన క్లారిటీ అయితే లేదు.
కానీ వెంట్రుకలు, గడ్డం మాత్రం భారీగా పెంచుతున్నాడు.ఈ లుక్ ఒక సినిమా కోసమే అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటూ కొంతమంది అక్కినేని అభిమానులు( Akkineni Fans ) సోషల్ మీడియాలో కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు.
అయినప్పటికీ ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు.ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ లేదు.
ఆయనకి కనక సరైన సక్సెస్ దక్కకపోతే మాత్రం ఇక ఆయన కెరియర్లో ఆయన మరొక హిట్టుని దక్కించుకోలేడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
"""/" /
చూడాలి మరి ఇప్పటికైనా అక్కినేని అఖిల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తాడా లేదా అనేది.
ఇక ఈ సినిమాతో కనక తనను తాను ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం అఖిల్ సినిమాలకు పనికిరాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇక ఇప్పుడు చేయబోయే సినిమా అఖిల్ కి ఒక అగ్ని పరీక్ష గా మారనుంది.
హీరో అంటే ఇలా ఉండాలి.. కటింగ్ మధ్యలో ఆపేసి… ఏం చేశాడో చూడండి!