మరాఠా రాజకీయాల్లో మరో ముసలం పుట్టనుందా?

అవునంటుంది మహారాష్ట్ర మీడియా( Maharashtra Media ) .ఎన్సీపీ నేత అజిత్ పవర్( NCP Leader Ajit Power ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భాజపా తీర్థం పుచ్చుకుంటారని… 2019 నాటి పరిస్థితులు మళ్లీ ఇక్కడ పునరావృతం అవుతాయంటూ మీడియా అక్కడ తెగ హడావిడి చేస్తుంది… సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న షిండే వర్గం మీద కేసులో 17 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురవుతారని ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశం ఉందని భావించిన భాజపా అధినాయకత్వం .

ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి …రాష్ట్రంలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

"""/" / తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్సీపీ జెండాను తొలగించడం, ఇటీవల నాగపూర్( Nagpur ) లో మీడియాతో మాట్లాడుతూ షిండే వర్గం ఎమ్మెల్యేలు సస్పెండ్ అయినా కూడా ప్రభుత్వం పడిపోదంటూ వ్యాఖ్యానించడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది.

ఆయన పార్టీ మారడం ఖాయమని సరైన అవకాశం కోసం చూస్తున్నారంటూ అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయియి అయితే దీనిపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరత్ పవర్( Sharat Pawar ) ఈ వ్యాఖ్యలను ఖండించారు.

అజిత్ పవార్ పార్టీ మార్పు వార్తలు పూర్తిగా అవాస్తవాలని ,ఆయన పార్టీ మారడం లేదంటూ స్పష్టం చేశారు.

తనపై వచ్చిన వ్యాఖ్యలను అజిత్ పవార్ కూడా ఖండించారు.తాను ప్రతి మంగళవారం బుధవారం పార్టీ నేతలతో సమావేశం అవుతానని దీనిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

తాను పార్టీ ని వీడేది లేదంటూ ఎన్సిపి లోనే కొనసాగుతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చారు.

"""/" / ఆయన ఈ విషయంలో ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికి ఊహ గానాలకు మాత్రం తెరపడటం లేదు.

తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని, అజిత్ పవర్ కు సన్నిహితంగా ఉండే ధనుంజయ్ ముండే( Dhanunjay Munde ) ఈ విషయంలో అజిత్ తరపున ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నారని.

సమీకరణలన్ని కుదిరితే ంటూ ఆయన పార్టీ మారడం ఖాయం అంటూ మీడియా జోస్యం చెబుతుంది.

మరి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరాటా రాజకీయాలలో మరో ముసలం పుట్టడం ఖాయమే అన్న అంచనాలు వస్తున్నాయి.

వీడియో వైరల్: అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో కాల్పులు