ఇంటింటి సమగ్ర సర్వే సమగ్రమేనా…?
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో కుటుంబ సమగ్ర సర్వే ఇంటింటికి వెళ్లి చేయకుండా ఒకే దగ్గర కూర్చొని అందరినీ అక్కడికి రప్పించుకొని వివరాలు నమోదు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొనుగోడు ఎన్యుమరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ పుష్ప ఇంటింటికి తిరగకుండా ఒకరి ఇంట్లో కూర్చొని అందరిని అక్కడికే పిలిపించుకొని వారు చెప్పిన వివరాలనే నమోదు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కారుస్తుందని ఆరోపిస్తున్నారు.
ఇదేంటని అడిగితే అర్జంట్ పని ఉండడంతో త్వరగా చేస్తున్నామని చెబుతుందని అంటున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా శ్రేయస్సు కొరకు నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వే ఎన్యుమరేటర్ నిర్లక్ష్యం,తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని,ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాల్సిన ఎన్యుమరేటర్ ఇంటింటికి వెళ్లకుండా ఒకే దగ్గర కూర్చొని వివరాలు సేకరించడం వల్ల సమగ్ర సర్వే సమగ్రమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎన్యుమరేటర్ పై తగిన చర్యలు తీసుకోని,తిరిగి రీ సర్వే చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అల్లు అర్జున్ వీడియో పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…. సంతోషంగా ఉందంటూ!