రేషన్ డీలర్ల ఎంపికలో అవకతవకలు…!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodada Constituency ) పరిధిలోని,కోదాడ మండల కేంద్రంలో 01,చిలుకూరు మండలం జెర్రీపోతులగూడెం 01, మునగాల మండలంలోని రేపాల 01, నర్సింహులగూడెం 01, బరాఖత్ గూడెం 01, కోదండరాంపురం 01, తిమ్మారెడ్డి గూడెం 01, మాధవరం 01,నడిగూడెం మండల కేంద్రంలో 01 చొప్పున ఖాళీ అయిన మొత్తం 09 రేషన్ దుకాణాల డీలర్ షిప్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన 200 మంది దరఖాస్తు చేసుకోగా వారికి 2023 ఏప్రిల్ 25న కోదాడ సిటీ సెంటర్ స్కూల్లో పరీక్ష నిర్వహించారు.

కొత్త రేషన్ డీలర్ల( New Ration Dealers ) నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సమాచారం లేకుండా,పరీక్షా ఫలితాలు ప్రకటించకుండానే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను మాత్రమే కోదాడకు పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించడంపై మిగతావారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

డీలర్ల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు,అధికార పార్టీ కార్యకర్తలకే డీలర్ షిప్పు దక్కేలా అధికార పార్టీ నాయకుడు చక్రం తిప్పి, ఒక్కొక్క డీలర్ షిప్పుకి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోందని ఆరోపిస్తున్నారు.

200 మంది రాసిన పరీక్షలోఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కొత్తగా వచ్చిన ఆర్డీవో ఈ గోల్ మాల్ పై దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరిపి,నియామకాలపై పునరాలోచన చేయాలని కోరారు.

లేనిపక్షంలో తామంతా కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.ఇంతకంటే దుర్మార్గం ఉండదని జెర్రిపోతులగూడెం అభ్యర్ధి మురళి అన్నారు.

పరీక్ష ఫలితాలను ప్రకటించకుండా ఇంటర్వ్యూలు నిర్వహించడం దుర్మార్గమైన చర్యని, ఇటువంటి విధానం ఏ ఉద్యోగ నియామకాలలో ఉండదన్నారు.

అధికార పార్టీ నాయకులు లంచాలు తీసుకొని పైరవీలు చేస్తున్నారని, అవసరమైతే నియామకాలపై కోర్టుకు వెళ్తామని చెప్పారు.

అఆలు రానివారికి ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించారని తిమ్మారెడ్డిగూడెం అభ్యర్ధి దైద సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అఆలు కూడా సరిగా రానివారు ఇంటర్వ్యూకువెళ్లడంపై అనుమానాలు ఉన్నాయని,రేషన్ డీలర్లకు నిర్వహించిన పరీక్ష పేపర్లను అధికారం పార్టీ నాయకులు లీక్ చేసి డీలర్ షిప్ లను అమ్ముకున్నారనిఆరోపించారు.

దీనిపై పూర్తి విచారణ జరిపి అర్హులైన వారికి రేషన్ డీలర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?