భూ బకాసురులు.. ఈ మాయలో టీఆర్ఎస్ నేతల హస్తం.. !?

అవినీతి చేయడంలో రాజకీయ నాయకులను మించిన వారుండరని అంటారు.వీరికి చీకటి దందలు ఎక్కువగా ఉంటాయని ప్రచారం కూడా ఉంది.

దీనికి తగ్గట్టుగానే రాజకీయ నేతల లీలలు భయటకు వస్తున్నాయి.ఇక ఈ మధ్య కాలంలో భూ బకాసూరులు ఎక్కువైయ్యారు.

ఇలాంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగిన అసైన్డ్ భూముల అక్రమ పట్టాల వ్యవహారంలో 207 ఎకరాలు మాయం అయినట్లు అధికారులు, పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్‌ను అరెస్టు చేయగా, ఇప్పటికే ముగ్గురు తహసీల్దార్లు ఏడుగురు వీఆర్వోలు నిందితులుగా ఉన్నారు.

వాస్తవానికి వెయ్యి ఎకరాలకు పైనే ఈ భూదందా సాగినట్లు అధికారులు గుర్తించారు.కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ దందా మొదలవగా, ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు పెద్ద మొత్తంలో భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్రమాలకు పాల్పడినట్లుగా కనుగొన్నారు.

ఇక ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్యే అనుచరులే కీలక పాత్ర పోషించగా, ఇందులో ఆ ఎమ్మెల్యేకు కూడా సంబంధాలున్నట్టు ప్రచారం జరుగుతుందట.

రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన జానీ మాస్టర్… ఆయన రియాక్షన్ ఇదే?