పేరు వల్ల ఎన్నో కష్టాలు పడ్డ ఐరన్ లెగ్ శాస్త్రి..చివరికి రిక్షాలో అనాధ శవంగా..!!

అప్పట్లో కమెడియన్ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు రాజబాబు ఆ తర్వాత పద్మనాభం .

వీరిద్దరే కామెడీతో ప్రేక్షకులని నవ్వించేవారు .దర్శకులు వీరి లేనిదే సినిమాని తీసేవారు కాదట .

అంతగా కమెడియన్స్ కి ప్రాధాన్యతని ఇచ్చేవారు .ప్రేక్షకులు కూడా వారి టైమింగ్ కి బాగా అలవాటు పడ్డారు .

పథ హీరోలకి అభిమానులు ఎలా వుంటారో .పాతతరం కమెడియన్స్ కి కూడా అంతే సమానంగా అభిమానులు ఏర్పడ్డారు .

ఆ తరువాత సినిమాలలోకి కమెడియన్స్ రాకా ఎక్కువైయ్యింది .దానితో పటు దర్శకులు కూడా కామెడీ సినిమాలు తీయడం మొదలుపెట్టారు వచ్చాయి .

రాజా బాబు మరియు పద్మనాభం తర్వాత వచ్చిన కమెడియన్స్ లో ఎక్కువగా ఆకట్టుకున్న వారిలో బ్రహ్మానందం , అలీ , బాబుమోహన్ , ఎంఎస్ నారాయణ ,ఐరన్ లెగ్ శాస్రి ఇలా కొందరు ఉన్నారు .

వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉండగా ఐరన్ లెగ్ గారి పేరుకి ప్రత్యేక గుర్తింపు ఉంది .

అసలు ఐరన్ లెగ్ శాస్రి ఎవరు అతని జీవిహ విశేషాలు గురించి ఇందులో తెలుసుకుందాం .

ఐరన్ లెగ్ శాస్త్రి గారి కామెడీ అందరితో పోలిస్తే వేరుగా ఉంటుంది .

ఆయన ఉన్నన్ని రోజులు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు మరియు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని నవ్వించారు .

ఆయన కామెడీ సన్నివేశాలు ఇప్పటి ఆడియన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు .అతని పేరు ఎంతలా ఫేమస్ అయ్యిందో .

ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథశాస్త్రి.రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అప్పుల అప్పారావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా అతడు దాదాపు 150 సినిమాల్లో నటించి తనకంటూ పేరుని సంపాదించుకున్నాడు బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి కాంబో వెండితెరపై కనిపించగానే ఇప్పటికి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారు అంటే వాళ్ళ జోడి ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు .

బాబుమోహన్ - కోట శ్రీనివాస్ రావు గారి జోడి తర్వాత అంతటి పేరు పొందిన జోడి ఎవరిదంటే అది ముమ్మాటికీ బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి జోడి అనే చెబుతారు .

"""/"/ పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన ఐరన్ లెగ్ శాస్త్రి సినిమాల్లోకి రాకముందు పురోహితునిగా పని చేసారు .

అయితే ఒక శుభకార్యంలో ఐరన్ లెగ్ శాస్త్రి గారిని చుసిన ఈవీవీ సత్యనారాయణ తన హాస్య చతురతని గమనించి అప్పుల అప్పారావు అనే మూవీలో ఐరన్ లెగ్ శాస్త్రి కి ఛాన్స్ ఇచ్చారు.

ఆ విధంగా వెండితెరకు పరిచయమైన ఐరన్ లెగ్ శాస్త్రి మంచి పేరు కామెడీ సన్నివేశాలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.

దీంతో అతనికి అనేక సినిమా అవకాశాలు వచ్చాయి.ప్రతి సినిమాలో అతడు చేసిన కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి .

దింతో అతడి పేరు టాలీవుడ్ మార్మోగిపోయింది .అయితే కొద్ది రోజుల తర్వాత ఆయనకు శారీరకంగా సమస్యలు ఎదురయ్యాయి.

ఆ కారణంగా ఆయన సినిమాలకి దూరం అయ్యారు .సినిమాలకి దూరం కావడంతో కుటుంబ భారమంతా తానే మోసేవారు దీంతో ఆర్థిక సమస్యలు ఆయనని చుట్టుముట్టాయి .

సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయారు.

అక్కడ పౌరహిత్యం చేస్తూ డబ్బులు సంపాదించాలని అనుకున్నారు .కానీ ఐరన్ లెగ్ అనే పేరు పడడంతో ఎవరు అతని ఇంటి చుట్టుపక్కలకు వెళ్లేవారు కాదు .

ఐరన్ లెగ్ అనే పేరుని అశుభం గా భావించి ఎవరు అతన్ని శుభకార్యాలకిపిలిచేవారు కాదు .

దీంతో ఐరన్ లెగ్ శాస్త్రి ఆర్థిక సమస్యలతో ఇంకా ఎక్కువైయ్యాయి .అదే సమయంలో ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు రావడం తో ఐరన్ లెగ్ శాస్రి పరిస్థి అంతకంతకు దిగజారిపోయింది .

"""/"/ ఈ దీనస్థితిని చూసి కుటుంబ సభ్యులు తమకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు అతడికి ఆర్థిక సాయం చేశారు.

కానీ ఆ డబ్బులకి అతని జీవితం మెరుగుపడలేదు .భారీకాయం , సినిమా అవకాశాలు తగ్గిపోవడం .

వచ్చిన పౌరోహిత్యం కూడా పేరు కారణంగా దూరం అవడం ఇవ్వని ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం లో ఎదురైనా ఆటుపోట్లు .

ఆలా అతడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2006 జూన్ 19వ తేదీన ఐరన్ లెగ్ శాస్త్రి తుదిశ్వాస విడిచారు.

మరణించిన అతడి భౌతికకాయాన్ని అంబులెన్స్ లో కాకుండా ఒక రిక్షా లో ఈడ్చుకు వెళ్లారని.

అతడి భార్య చెబుతూ కన్నీరు పెట్టుకుంది .ఏది ఏమైనా ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజులలో దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని చెప్పక తప్పదు .

ఐరన్ లెగ్ అనేది అతడు చేసిన సినిమాలలో బాగా ఫేమస్ అయినా అతని నిజ జీవితం లో మాత్రం వైఫల్యం చెందాడు అతని పేరే అతనిని ఈ దుస్థితికి వచ్చేలా కారణమైందని చెప్పక తప్పదు .

యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా బాట పట్టారా..?