చంద్రబాబు అరెస్టును ఖండించిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల..!!
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్టు రోజురోజుకీ సంచలనంగా మారుతోంది.జాతీయస్థాయి నాయకులతోపాటు సినిమా సెలబ్రిటీలు పలువురు ప్రముఖులు చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు అరెస్టు పట్ల మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల( Irom Sharmila ) స్పందించడం జరిగింది.
పదహారేళ్ల పాటు జైలు శిక్షను సుదీర్ఘంగా గృహనిర్బంధం ఎదుర్కొంటున్న తనకు.రాజకీయ ఖైదీలు పట్ల సానుభూతి ఉందని స్పష్టం చేయడం జరిగింది.
చంద్రబాబు నాయుడు ఒక దర్శినిత కలిగిన ప్రజా నాయకుడిగా ఎంతో ఖ్యాతి గడించారు.
అటువంటి నాయకుడిని అక్రమంగా నిర్బంధించడాన్ని నాతో పాటు ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే.ఒకవేళ దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అవినీతికి వ్యతిరేకంగా సహేతుకమైన దర్యాప్తు జరిగితే.
ఈడీ ఇంతవరకు ఒక్క బీజేపీ( BJP ) నాయకుడిపై కూడా నేరం ఎందుకు మోపలేదు?.
ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు మోడీనే చేయిస్తున్నారని స్పష్టమవుతుంది.ప్రజా నేతలను ఆయన అలా అవినీతి ముద్ర వేసి అణిచివేయకూడదు.
ఒక్కరిద్దరూ కాదు ఎంతోమంది రాజకీయ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు.ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులను గౌరవించి వారందరిని విడుదల చేయాలి".
అంటూ ఇరోమ్ షర్మిల.చంద్రబాబు అరెస్ట్ నీ ఖండించిన వీడియోని టీడీపీ సోషల్ మీడియా విడుదల చేయడం జరిగింది.
నెట్ ఫ్లిక్స్ లో చైతన్య శోభిత వెడ్డింగ్… స్ట్రీమింగ్ రైట్స్ ఎంతనో తెలుసా?