రిఫరీ పై ఫుట్ బాల్ ప్లేయర్ దాడికి యత్నం.. జరిమానా తో పాటు రెండేళ్ల నిషేధం..!

ఓ ఫుట్బాల్ ప్లేయర్ తనకు రెడ్ కార్డ్ చూపించడంతో ఏకంగా రిఫరీ పై దాడికి ప్రయత్నించి భారీ జరిమానా తో పాటు రెండేళ్ల నిషేధానికి గురైయాడు.

మైదానంలో కాస్త దురుసుగా ప్రవర్తించడం చివరికి తన కొంప ముంచింది.ఇరాక్ దేశంలోని ఆల్-కావ-ల్-జవియా క్లబ్ కు చెంది మిడ్ ఫిల్డర్ ఇబ్రహీం బయేష్( Ibrahim Bayesh ) కు ఆట మధ్యలో రిఫరీ మొదట ఎల్లో కార్డు చూపించడంతో ఇబ్రహీం కోపంగా రిఫరీ ని చుట్టూముట్టాడు.

తరువాత రిఫరీ రెడ్ కార్డ్ చూపించడంతో ఇబ్రహీం ఆవేశంతో రిఫరీ పై దాడికి ప్రయత్నించాడు.

అంతేకాకుండా రిఫరీని అవమానించడంతో పాటు బెదిరించాడని అసోసియేషన్ వెల్లడించింది. """/" / ఆదివారం ఆల్ షాబ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆల్-కావ-ల్-జవియా పై అల్-కహ్రబ-క్లబ్ 3-2 తో విజయం సాధించింది.

ఓటమిని జీర్ణించుకోలేకపోయినా ఆల్-కావ-ల్-జవియా క్లబ్ ఫ్యాన్స్ ఆందోళన చేసి స్టేడియంలోని ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు.

ఈ విషయాన్ని కూడా ఇరాక్ ఫుట్బాల్ అసోసియేషన్ (Iraq Football Association )సీరియస్ గా తీసుకుంది.

"""/" / ఈ క్లబ్ లో జరిగే తర్వాతి మూడు మ్యాచ్లకు అభిమానులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.

దీనిని ఖండిస్తూ పది మిలియన్ ఇరాకీ దినార్ల జరిమానా విధించింది.భారత కరెన్సీలో రూ.

6 లక్షల రూపాయలు.అంతేకాకుండా స్టేడియంలో ధ్వంసమైన ఫర్నిచర్ మరమత్తు ఖర్చులను కూడా చెల్లించాల్సిందిగా క్లబ్ ఆదేశించింది.

"""/" / క్రీడలలో గెలుపు, ఓటములు సహజం.ఈ రెండింటిని సమానంగా స్వీకరించి భవిష్యత్తులో మెరుగైన ఆటను ప్రదర్శించాలి.

అంతేకానీ ఇలా రిఫరీ పై దాడి చేయడం, స్టేడియంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడం సరైనది కాదని ఇరాక్ ఫుట్బాల్ సంఘం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

సునీల్ ఒక్కో సినిమాకి ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా.. ఏడాది ఆదాయం ఎంతంటే..??