ఇరాన్‌కి చెందిన ఖోరామ్‌షహర్‌-4 క్షిపణి చిత్రాలివే… తాజాగా విడుదల!

బాలిస్టిక్‌ క్షిపణి 'ఖోరామ్‌షహర్‌-4'( Khorramshahr-4 ) తాజా వెర్షన్‌ను ఫోటోలను ఇరాన్‌( Iran ) నిన్న అనగా మే 25 గురువారం నాడు విడుదల చేసింది.

ఇక అణ్వాయుధాలపై పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ ఈ క్షిపణినిని ప్రదర్శించడం మిగతా దేశాలకు మింగుడు పడడం లేదు.

తెహ్రాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రక్కులో అమర్చిన లాంచర్‌పై క్షిపణి ఖరామ్‌షహర్‌-4ను మీడియా ముందు ప్రదర్శించారు.

త్వరలో ఈ క్షిపణిని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేయవచ్చని రక్షణ మంత్రి జనరల్‌ మొహ్మద్‌ రెజా అస్తియాని( Mohammad-Reza Ashtiani ) ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు.

"""/" / 3,300 పౌండ్లు అంటే సుమారు 1500 కిలోలు బరువు కలిగిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేధించగలదని ఆయన అన్నారు.

కాగా ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది.

అయితే ప్రయోగం ఎప్పుడు, ఎక్కడ చేస్తారన్న విషయం మాత్రం వెల్లడించలేదు.1980లో ఇరాన్‌ - ఇరాక్‌ యుద్ధంలో భారీ పోరాటాలు జరిగిన ఇరాన్‌లోని నగరం ఖరామ్‌షహర్‌ పేరును ఈ క్షిపణికి పెట్టడం జరిగింది.

"""/" / ఇకపోతే, మధ్య ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వతాలకు అతి సమీపంలో, భూమికి చాలా లోతులో.

ఇరాన్ భారీ అణు సదుపాయాన్ని నిర్మిస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అగ్రరాజ్యం అమెరికాకి చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు సైతం.

నాశనం చేయలేని విధంగా దీని నిర్మాణం చేపడుతోందని భోగట్టా.నటాంజ్ ప్రాంతంలో సొరంగాలను తవ్వి, అణు బాంబు తయారీకి దీన్ని ఇరాన్ నిర్మిస్తోంది.

తద్వారా అమెరికాతో పాటు అనేక దేశాలకు పరోక్షంగా ఇరాన్ సవాలు విసురుతోందని రాజకీయ ఉద్ధండులు విశ్లేషిస్తున్నారు.

అక్కినేని అఖిల్ మామ చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!