ట్రంప్‌ను చంపితే 80 మిలియన్ డాలర్ల రివార్డు

ఇరాన్‌లో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తి జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చడంతో ప్రస్తుతం ఇరాన్‌ భగ్గుమంటోంది.

అందుకు తగ్గట్టుగానే సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం శపథం చేసింది.

దీంతో ఇరాన్-అమెరికా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది.ఇలాంటి పరిస్ధితుల్లో ఇరాన్‌ అధికారిక మీడియాలో ట్రంప్ తలపై 80 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటన సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఖాసీం సులేమానీ అంత్యక్రియలకు సంబంధించి ఇరాన్ అధికారిక టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ల మంది ప్రజలున్నారు.దీని ఆధారంగా ఒక్కొక్కరి నుంచి ఒక్కో డాలర్ సేకరించి 80 మిలియన్ డాలర్లు సేకరిస్తామన్నారు.

ఆ మొత్తాన్ని ట్రంప్‌ను చంపిన వారికి రివార్డుగా బహూకరిస్తామన్నది ఆ కథనాల సారాంశం.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Iran-State-TV-Advertises-80-Million-Reward-డాలర్ల-రివార్డు!--jpg"/మరోవైపు సులేమానీ హత్యకు ప్రతీకారంగా తమ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్‌పై జరిగే ప్రతిదాడి భయంకరంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు చేశారు.

ఇందుకోసం ఇప్పటికే 52 స్థావరాలను ఎంపిక చేసి ఉంచామన్నారు.కాగా సులేమానీ అంత్యక్రియలు ఆదివారం లక్షలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించారు.

రోడ్ల మీదకు భారీగా వచ్చిన ఇరానీయన్లు నల్లటి దుస్తులు ధరించి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?