యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణశిక్ష .. భారత్‌కు ఇరాన్ ఆపన్న హస్తం, కాపాడతామని హామీ

యెమెన్‌లో( Yemen ) మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన నర్స్ నిమిషా ప్రియ (38)( Nurse Nimisha Priya ) విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.

దౌత్యపరంగానూ యెమెన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది.ఈ నేపథ్యంలో మనకు మిత్రదేశమైన ఇరాన్.

( Iran ) నిమిషా ప్రియను రక్షించేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.

2017లో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసినందుకు గాను నిమిషా ప్రియను దోషిగా తేల్చిన అక్కడి కోర్టు మరణశిక్షను( Death Sentence ) విధించగా.

గత సోమవారం ఈ శిక్షను ఆ దేశాధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఖరారు చేశారు.

నెల రోజుల వ్యవధిలో నిమిషా ప్రియకు మరణశిక్షను అమలు చేయనున్నట్లుగా కథనాలు రావడంతో కేరళలోని( Kerala ) ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

"""/" / ఈ పరిణామాలను గమనిస్తున్న విదేశాంగ శాఖ నేరుగా రంగంలోకి దిగి.

యెమెన్ ప్రభుత్వంతో టచ్‌లోకి వెళ్లింది.బ్లడ్ మనీ చెల్లించేందుకు నిమిషా ప్రియ కుటుంబం కూడా సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇంతలో యెమెన్ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరుపుతుండగా ఇరాన్‌ను కూడా భారత్ సాయం కోరింది.

ఈ క్రమంలో యెమెన్ పరిపాలనా రాజధాని సనాలో( Sanaa ) విచారణలో ఉన్న కేసును పర్యవేక్షిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది.

సనా .ఇరాన్ మద్ధతున్న హౌతీ రెబల్స్ ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే.

"""/" / నిమిషా ప్రియకు సంబంధించిన సమస్యను తాము స్వీకరిస్తున్నామని, మా తరపున చేయగలిగినదంతా చేస్తామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు గురువారం న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ఈ వార్త తెలుసుకున్న నిమిషా ప్రియ కుటుంబం ఊరట చెందింది.తన బిడ్డను వీలైనంత త్వరగా విడిపించి, స్వదేశానికి తీసుకురావాలని నర్స్ తల్లి, ఆమె భర్త భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇరాన్ రంగ ప్రవేశం నేపథ్యంలో యెమెన్ ప్రభుత్వం నిమిషా ప్రియ మరణశిక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.

ప‌చ్చి అల్లం తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?