ఔను ఆ పని చేసింది ఇరానే

గత కొన్ని రోజులుగా అమెరికాను కవ్వించడంతో పాటు యుద్ద మేఘాలు కమ్ముకునేలా చేస్తున్న ఇరాన్‌ ఇటీవల ఉక్రెయిన్‌ విమానాన్ని కూల్చివేసిందట.

ఉక్రెయిన్‌ విమానం ఇరాన్‌ దేశంలో కుప్పకూలిన విషయం తెల్సిందే.మొదట అది సహజ ప్రమాదంగా అంతా భావించారు.

అదే సమయంలో అమెరికా మరియు ఇరాన్‌ల మద్య యుద్ద వాతావరణం నెలకొన్న కారణంగా అమెరికా యుద్ద విమానం తమ దేశ గగనతలంపైకి వస్తుందనే ఉద్దేశ్యంతో ఇరాన్‌ మిసైల్స్‌ను ప్రయోగించి ఆ విమానంను కూల్చేయడం జరిగింది.

ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్‌ ప్రకటించింది.ఇప్పఇకే ఇరాన్‌ పై పీకల్లోతు కోపంతో ఉన్న పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ కారణం ఎత్తి చూపుతూ ఇరాన్‌పైకి యుద్దానికి సిద్దం అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్త సంపాదకులు అంటున్నారు.

పలు దేశాలతో ఇరాన్‌ విషయమై అమెరికా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఐక్యరాజ్య సమితిలో కూడా ఇరాన్‌ దుశ్చర్యలను ప్రస్తావించేందుకు అమెరికా సిద్దం అయ్యింది.

ఇరాన్‌ చేసిన పనితో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటుంది.ఆ విమానంలో ఉన్న 180 మంది సజీవ దహనం అయిన విషయం తెల్సిందే.

వాలంటీర్లతో  ‘రాజకీయం ‘.. అదిరిపోయే స్కెచ్ వేసిన వైసిపి ?