తండ్రి గుమస్తా కొడుకు ఐపీఎస్.. రజనీకాంత్ సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
యూపీఎస్సీ ( UPSC ) నిర్వహించే పరీక్షలలో సత్తా చాటడం కోసం దేశంలోని లక్షల సంఖ్యలో యువతీయువకులు ఎంతో కష్టపడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల పేద విద్యార్థులలో చాలామందికి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించడం కలగానే మిగిలిపోతుంది.
అయితే రజనీకాంత్ మాత్రం ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు అధిగమించి ఉన్నత స్థాయికి చేర్చుకున్నారు.
గుమస్తాగా పని చేసి కుటుంబాన్ని పోషించిన తండ్రికి ఐపీఎస్ లక్ష్యాన్ని సాధించి తన సక్సెస్ ను ఆయన బహుమతిగా ఇచ్చారు.
రాజంపేట మండలంలోని అర్గొండకు ( Argonda )చెందిన రజనీకాంత్ ( Rajinikanth ) అమ్మ బీడీలు చుట్టేవారని నాన్న గుమస్తాగా పని చేయడంతో పాటు వేర్వేరు వృత్తుల్లో పని చేశారని వెల్లడించారు.
ఆస్తులు అమ్మి మరీ మంచి చదువులు చదివించారని ఆయన పేర్కొన్నారు.తాను చదువు పూర్తైన తర్వాత ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండు సంవత్సరాల పాటు టీచింగ్ ప్రొఫెషన్ లో జాబ్ చేశానని ఆయన అన్నారు.
"""/" /
ఆ సమయంలో 11 లక్షల రూపాయల ప్యాకేజీతో జాబ్ వచ్చినా సివిల్స్ పై ఆసక్తితో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని రజనీకాంత్ పేర్కొన్నారు.
ఒక వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సమయంలో ఐపీఎస్ కావాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఆరో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షకు సంబంధించి నా కల నెరవేరిందని 587వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.
"""/" /
సామాన్యులు సైతం పోలీస్ ఉన్నతాధికారులను కలిసే పరిస్థితి రావాలని రజనీకాంత్ వెల్లడించారు.
నేను అందరినీ సమానంగా చూస్తానని ఆయన చెప్పుకొచ్చారు.రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రిపేర్ అయ్యానని రజనీకాంత్ పేర్కొన్నారు.
కొడుకు సివిల్స్ కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఐపీఎస్ రజనీకాంత్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.
భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక.. అలా చెప్పడంతో?