దంచికొట్టిన వార్నర్, బెయిర్‌స్టో .. పంజాబ్ టార్గెట్ 202 !
TeluguStop.com
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2020 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మొదటిసారి తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు.
కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో ఒకరితో ఒకరు పోటీ పడి మరీ సిక్సులు, ఫోర్లతో స్క్రోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
వీరిద్దరూ కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఓ దశలో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో భారీ స్క్రోర్ నమోదు చేయడం ఖాయం అని అనుకున్నారు.
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ మెరుపు అర్ధశతకాలు సాధించిన ఈ ఇద్దరు ఒకే ఓవర్ లో పెవిలియన్ బాట పట్టడంతో స్క్రోర్ 201 వద్దే ఆగిపోయింది.
మొదట బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్ అర్థ శతకం సాధించాడు.
వార్నర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 52 పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు.
దాంతో ఆరెంజ్ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆపై వెంటనే బెయిర్ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటయ్యాడు.
బెయిర్ స్టో 55 బంతుల్లో 97 పరుగులు వద్ద అవుట్ అయ్యి , తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
బిష్ణోయ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.దాంతో 160 పరుగుల వద్దే ఎస్‌ఆర్‌హెచ్ మరో వికెట్‌ను కోల్పోగా, మరో పరుగు వ్యవధిలో మనీష్ పాండే వికెట్ ను నష్టపోయింది.
అర్షదీప్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పాండే నిష్క్రమించాడు.ఆ తరువాత విలియమ్సన్ 20 , అభిషేక్ శర్మ 12 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించడంతో స్క్రోర్ బోర్డు 200 దాటింది.
అంతకుముందు టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.ఇక పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఆరో స్థానంలో ఉండగా,చివరి స్థానంలో పంజాబ్ ఉంది.
భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో శివ కార్తికేయన్.. ఏం చేశారంటే?