ఐపీఎల్ లో పది సెకండ్స్ యాడ్ కు కాస్ట్ ఎంతో తెలుసా?

వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్లబ్ గా కొనసాగుతున్న బిసిసిఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ఎట్టకేలకు సెప్టెంబర్ 19న యూఏఈలో మొదలవ్వనున్నది.

అందువలన దానికి సంబంధించిన సన్నాహాలు చేసుకోవడంలో బిసిసిఐ మరియు ఐపిఎల్ ఫ్రాంచైజీలు బాగా బిజీగా ఉన్నాయి.

ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాలో వార్త చక్కెర్లు కొడుతుంది.ఆ వార్త సమాచారం మేర స్టార్‌ యాజమాన్యం గతేడాది ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేసినందుకు తమ బ్రాండింగ్‌ భాగస్వాముల ద్వారా దాదాపు రూ.

3000 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఫ్యాన్స్ కు స్టేడియంలో అనుమతి లభించదు.

అందువల్ల ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌తో పాటు ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించడానికి స్టార్ యాజమాన్యం సిద్ధమవుతుంది.

ఐపీఎల్ ప్రసారం చేసే టైంలో తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి వచ్చే అడ్వర్టైజర్స్ వద్ద 10 సెకండ్స్ కు 12.

5 లక్షల మొత్తాన్ని స్టార్ యాజమాన్యం వసూలు చేయబోతుందట.మరి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సివుంది.

ఏపీలో పెన్షన్ కష్టాలు.. చంద్రబాబుకు బుద్ధి చెబుతామంటున్న ప్రజలు