ఐపీఎల్ మ్యాచ్ లా రాజకీయాలు..: బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) తనను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు.

ప్రస్తుత రాజకీయాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ లా నడుస్తున్నాయని తెలిపారు.ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ( Narendra Modi ) కెప్టెన్సీలో సుమారు నాలుగు వందల ఎంపీ సీట్లు సాధిస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్న ఆయన మహిళలకు రూ.

2,500 ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ హామీలను అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ ను( Karimnagar ) అభివృద్ధి చేసింది బీజేపీనేనని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే సంక్షేమం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.

ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!