ఈ రోజే ఐపీఎల్ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్... చెన్నై తో ముంబై పోరు... ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఉన్నాయో తెలుసా...

ఐపీఎల్ లో లీగ్ దశ ముగిసి క్వాలిఫైర్ మ్యాచ్ ల పోరు ఆరంభం కానుంది.

మొదటి క్వాలిఫైర్ లో ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు ఫైనల్ కి చేరనుంది.ఓడిన జట్టు క్వాలిఫైర్ 2 లో ఆడుతుంది.

ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచే ఫైనల్ లో బెర్తు ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు పోటాపోటీగా తలపడనున్నాయి.

H3 Class=subheader-style1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి/h3p చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్ లు జరగగా ముంబై జట్టు 15 మ్యాచ్ లలో విజయం సాధించగా , చెన్నై జట్టు 11 మ్యాచ్ లలో గెలుపొందింది.

H3 Class=subheader-style2)పిచ్ ఎలా ఉండబోతుంది/h3p ఈ మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియం లో జరగనుంది.

ఇక్కడి పిచ్ పైన పరుగులు సాధించడం అంత సులభమేమి కాదు .మొదట బ్యాటింగ్ చేసే జట్టు 170 పైగా పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది.

"""/"/ H3 Class=subheader-style3)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది/h3p చెన్నై , ముంబై మధ్య మ్యాచ్ అంటే అటు జట్ల మధ్య , ఇటు అభిమానుల మధ్య తీవ్ర ఉత్కంఠ ఉంటుంది.

ఈ సారి ముంబై ఇండియన్స్ పైన గెలిచి చివరి రెండు సార్లు ముంబై పైన ఓడినందుకు ప్రతీకారం తీర్చుకోవలన్న లక్ష్యం తో చెన్నై ఆడబోతుంది.

ఇకపోతే ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడో వేచి చూడాల్సిందే.

అతను ఈ సీజన్ మొత్తం లో ఒక భారీ ఇన్నింగ్స్ మినహా ఈ మ్యాచ్ లో రాణించలేదు.

ఇకపోతే ఆ జట్టు కీలక ఆటగాడు కేదార్ జాధవ్ గాయం కారణంగా దూరం అవ్వబోతున్నాడు.

చెన్నై జట్టు చెపాక్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లలో ఒకటి రెండు మినహా అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది.

పిచ్ ఒకవేళ స్పిన్నర్లకి అనుకూలిస్తే ఇమ్రాన్ తహిర్ , హార్బజన్ బౌలింగ్ ల పైనే చెన్నై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) - షేన్ వాట్సన్ , ఫాఫ్ డూప్లెసిస్ ,సురేష్ రైనా ,అంబటి రాయుడు , ధ్రువ్ షోరే , ధోని ,జడేజా , బ్రావో , హార్బజన్ , ఇమ్రాన్ తహిర్ , దీపక్ చహార్ """/"/ H3 Class=subheader-style4)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది/h3p ముంబై ఇండియన్స్ జట్టు లీగ్ స్టేజి లో ఎలా ఆడిన సరే క్వాలిఫైర్స్ , ఫైనల్ మ్యాచ్ లలో దానికి భిన్నంగా ఆటను ప్రదర్శిస్తుంది.

ఐపీఎల్ లో చెన్నై జట్టు పైన ముఖముఖిగా తలపడిన మ్యాచ్ లలో ముంబై దే పై చేయి.

ఇక చెన్నై జట్టు చెపాక్ స్టేడియం లో ముంబై పైన గెలిచిన చివరి మ్యాచ్ 2010 లో ఆడినది.

ముంబై జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ వరుస వైఫల్యలతో సతమతమవుతున్నాడు అతని స్తానం లో ఇతర ఆటగాడికి తీసుకునే అవకాశం ఉంది.

ఇకపోతే బ్యాటింగ్ లో బౌలింగ్ లో మెరుగ్గా కనిపిస్తున్న ముంబై జట్టు చెన్నై తో జరిగే మ్యాచ్ లో ఫెవరేట్ గా బరిలోకి దిగుతోంది.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) - డికాక్ , రోహిత్ శర్మ , సూర్య కుమార్ యాదవ్ ,ఈవిన్ లూయిస్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య , పోలార్డ్ , రాహుల్ చహార్ , లసిత్ మలింగ , బుమ్రా , అంకుల్ రాయ్.

పులికి వణుకు పుట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్‌..