మాది తండ్రి కొడుకులా బంధం అంటున్న సీఎస్ కే చీఫ్ శ్రీనివాసన్
TeluguStop.com
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
మొదట ఐపీఎల్ ఆడడానికి యూఏఈకి టీంతో కలిసి బయల్దేరిన సురేష్ రైనా అనుకోకుండా ఉన్నట్టుండి తిరిగి భారత్ చేరాడు.
రైనా వ్యక్తిగత కారణాల వల్లే తిరిగి ఇంటిముఖం పట్టాడని అందరూ అనుకున్నారు కానీ హోటల్ గది' వార్త అంటూ ప్రచారం జరగడంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది.
తాజాగా సీఎస్‌కే చీఫ్ శ్రీనివాసన్ తనది రైనాది తండ్రీకొడుకుల బంధమని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు.
దానితో ఈ వివాదం త్వరలో ముగియనున్నట్లు తెలుస్తుంది.మీడియాతో మాట్లాడిన సీఎస్‌కే చీఫ్ శ్రీనివాసన్ రైనా వ్యవహారశైలితో తనకు మొదట్లో ఆగ్రహం తెప్పించింది అని కానీ స్వయంగా రైనా ఫోన్ చేసి వివరణ ఇవ్వడంతో నేను సంతృప్తి చెందానని ఆయన తెలియజేశారు.
హోటల్ గది' వార్తలో నిజం లేదని అదే ఎవరో కావాలని సృష్టించారని ఇప్పటికే ఈ అంశంపై రైనా స్పష్టత ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా సీఎస్‌కే చీఫ్ శ్రీనివాసన్ కూడా రైనాకి మద్దతుగా స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఈ అంశం ముగిసినట్లేనని ఈ ఐపీఎల్ లో రైనా ఆడుతాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
.