అనకాపల్లిలో ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్
TeluguStop.com
ఐపీఎల్ బెట్టింగ్ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.ఈ విషాద ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది.
బెట్టింగ్ కోసం విద్యార్థి మధు బుకీ నుంచి డబ్బులు తీసుకున్నాడని తెలుస్తోంది.తీసుకున్న అప్పు చెల్లించాలని బుకీ విద్యార్థిపై ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన మధు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా మధు అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేను ఆ భారం అనుభవించాను… నా కూతురికి వద్దు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!