ఐపీఎల్ 23: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ ట్రోఫీ గెలుచుకున్న బిర్యానీ?
TeluguStop.com
దాదాపు 2 నెలల పాటు ఫ్యాన్స్‌ను అలరించిన ఐపీఎల్ ( IPL2023 )2023 గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్( GT Vs CSK ) మధ్య సాగిన ఫైనల్ ( Final Match )పోరుతో విజయవంతంగా ముగిసింది.
ఎంస్ ధోనీ( MS Dhoni ) నేతృత్వంలోని సీఎస్‌కే టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే.
ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోతే ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.
ఐపీఎల్ సీజన్‌లో బిర్యానీ ట్రోఫీ గెల్చుకుందని వెల్లడించింది.బిర్యానీ 'మోస్ట్ ఆర్డర్ డిష్'(
Most Ordered Dish ) టైటిల్‌ను గెలుచుకుంది అంటూ తాజాగా వారు ట్విట్ చేసారు.
దాంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. """/" /
ఐపీఎల్ కారణంగానే నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది.
ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని తాజా ప్రకటనలో పేర్కొంది.
ఆర్డర్ చేసిన ప్రతి వెజ్ బిర్యానీకి, దేశవ్యాప్తంగా 20 నాన్-వెజ్ బిర్యానీలే అని చిట్టా కూడా విప్పారు.
ఈ క్రమంలో ఈ క్రికెట్ సీజన్‌లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్‌లతో ఫుడ్ లీడర్ బోర్డ్‌లో ఆధిపత్యం బెంగుళూరు టాప్‌లో నిలిచినట్టు చెప్పుకొచ్చారు.
అలాగే ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు ఈ సీజన్‌లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేయడం కొసమెరుపు.
ఇక అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ.26,474 అంట.
కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్‌ను క్యాష్ చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ ఆనందం పట్టలేక రకరకాల ట్వీట్లతో సోషల్ మీడియాలో విరుచుకు పడుతోంది.
చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షిస్తోంది.కొంతమంది వీటిని చూసి ఇదోరకమైన బిజినెస్ డ్రామా అని కామెంట్స్ చేస్తే, కొన్నింటిపై ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది స్వైగ్గి.
కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)