చూస్తున్న.. అంతా చూస్తున్న.. అంత గొడవ జరుగుతున్న రోహిత్ రియాక్షన్ మాములుగా లేదుగా!

అంతర్జాతీయ క్రికెట్‌లోని వైరల్ వీడియోలలో ఆటగాళ్ల మధ్య ఎమోషనల్ మోమెంట్స్ ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి.

అంపైర్లతో చర్చలు, ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక కౌగిళ్లు, క్రీడా మానసికతకు విరుద్ధంగా జరిగిన ఘర్షణలు అన్ని ఘటనలు జరుగుతుంటాయి.

తాజాగా బుమ్రా – కరుణ్ నాయర్ ( Bumrah – Karun Nair )మధ్య జరిగిన ఘర్షణ వీడియో కూడా అలాంటి ఒక వైరల్ క్లిప్‌గా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) ఉత్కంఠ భరిత పోరులలో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్‌ను అందించింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించగా, చివరి వరకు రసవత్తరంగా సాగిన పోరులో బుమ్రా – కరుణ్ నాయర్ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం సంచలనంగా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. """/" / మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ బాగా మొదలైనా, 19వ ఓవర్ లో ముంబై జట్టు అద్భుతంగా ఆటతీరు ప్రదర్శించింది.

వరుసగా ముగ్గురు బ్యాట్స్‌మెన్లను (అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ) రన్ అవుట్ చేయడం ద్వారా మ్యాచ్‌ను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంది.

ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ దిశ మారింది.వరుస రెండు ఓటముల అనంతరం ముంబై జట్టుకు ఇది రెండవ విజయం కావడం విశేషం.

ఢిల్లీ ( Delhi )తరఫున బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌కు ధీటుగా బదులిచ్చాడు.

ఆ ఓవర్‌లో రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో కలిపి 18 పరుగులు రాబట్టిన కరుణ్, చివరి బంతికి బుమ్రాను ఢీకొన్నాడు.

మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్‌లోకి వచ్చిన కరుణ్, 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో తన సత్తా చాటాడు.

అయితే పరుగుల సమయంలో బుమ్రాను తాకడం ఇరువురి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.

కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా సంతృప్తిగా కనిపించలేదు.దానితో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపారు.

"""/" / ఈ గొడవ నడుస్తున్న సమయంలో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ( Former Captain Rohit Sharma ) స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తనకు అందరిదీ తెలుసన్నట్లుగా తల ఊపుతూ చూపించిన అభిప్రాయం వీడియోలో హైలైట్‌గా మారింది.

రోహిత్ ఫేస్ రియాక్షన్ ఈ గొడవ కంటే ఎక్కువగా ఆకర్షణగా నిలిచింది.మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా, కరుణ్ కలిసి మాట్లాడుకున్నారు.

ఇది కేవలం ఆటలో భాగమేనని, ఎలాంటి పర్సనల్ విషయాలు లేవని ఇద్దరూ స్పష్టం చేశారు.

క్రీడా స్పూర్తి పరంగా జరిగిన ఈ సంఘటన చివరకు శాంతియుతంగా ముగియడం సంతోషకర విషయం.