ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో టాప్ 5 లో ఎవరున్నారంటే..?

ఈ ఐపీఎల్( IPL ) సీజన్లో సగం మ్యాచులు ఉత్కంఠ భరితంగా ముగిసాయి.

ఈ లీగ్ లో మొత్తం 70 మ్యాచ్లలో 36 మ్యాచులు ముగిసాయి.ఇక 36వ మ్యాచ్ కలకత్తా- బెంగళూరు మధ్య జరిగి కలకత్తా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో బెంగుళూరు జట్టు హవా నడుస్తోంది.ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు ఫాఫ్ డుప్లేసిస్.

( Faf Duplessis ) ఇతను ఆడిన 8 మ్యాచ్లలో 422 పరుగులు చేశాడు.

"""/" / ఇక రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ( Virat Kohli ) కొనసాగుతున్నాడు.

కోహ్లీ ఆడిన 8 మ్యాచ్ లలో 333 పరుగులు చేశాడు.ఈ సీజన్ ఆరంభంలో మొదటి స్థానంలో కొనసాగిన డ్వేన్ కన్వే మూడవ స్థానానికి పడిపోయాడు.

ఇతను ఆడిన ఏడు మ్యాచ్లలో 314 పరుగులు చేశాడు.ఇక నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్( David Warner ) ఉన్నాడు.

ఇతను ఆడిన ఏడు మ్యాచ్లలో 306 అడుగులు చేశాడు.ఇక వెంకటేష్ అయ్యర్ ఆడిన 8 మ్యాచ్లలో 285 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచాడు.

"""/" / పర్పుల్ క్యాప్ రేస్ విషయానికి వస్తే.ఈ రేసులో కూడా బెంగుళూరు జట్టు హవా నే కొనసాగుతోంది.

మహమ్మద్ సిరాజ్ 8 మ్యాచులలో 14 వికెట్లు తీసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక గుజరాత్ జట్టుకు చెందిన రషీద్ ఖాన్ ఏడు మ్యాచ్లలో 14 వికెట్లు తీసి, 16.

14 ఎకానమీ తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.కోల్ కత్తా కు చెందిన వరుణ్ చక్రవర్తి 13 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

పంజాబ్ జట్టు కు చెందిన అర్ష దీప్ సింగ్ 13 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

రాజస్థాన్ జట్టుకు చెందిన యుజ్వేంద్ర చాహల్ 12 వికెట్లు తీసి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

పవిత్రమైన జలం అనుకుని తాగేశారు.. చివరికి అది ఏ వాటరో తెలిసి షాక్..?