ఐపీఎల్ 2021: ఓ వైపు కరోనా.. మరోవైపు ఐపీఎల్..!

నేడు ఐపీఎల్ 14 సీజన్ భారత్ లో పూర్తిగా బయో బబుల్ నీడలో మొదలు కాబోతోంది.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా రోజుకు పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసమైన ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను అనుమతించకుండా కేవలం ఖాళీ మైదానాల్లో ఈ సీజన్ మొదలు కాబోతోంది.

నేడు చివరి సంవత్సరం డిఫెండింగ్ చాంపియన్ గా నిలబడిన ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ జట్టు మొదటి మ్యాచ్ జరుగనుంది.

ఈ మ్యాచ్ చెన్నై వేదికగా మొదలు కాబోతోంది.ఇక 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ ఆధ్వర్యంలో కాస్త పటిష్టంగానే కనపడుతుంది.

ఇక ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీ ఆధ్వర్యంలో కొత్తగా జట్టులోకి మ్యాక్స్ వెల్ రాకతో నైనా వారి రాత మారుతుందని యాజమాన్యం ఎదురుచూస్తోంది.

"""/"/ ఇప్పటికే ఒకరిద్దరు ఐపీఎల్ ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడటంతో వారు ఐపిఎల్ సీజన్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది.

చూడాలి మరి నేటితో మొదలయ్యే ఐపీఎల్ 14 సీజన్ లో ఏ జట్టు ఇలాంటి ఉపాయాలు వేసి ప్రత్యర్థి జట్టుపై విజయం సాధిస్తారో చూడాలి.

ఏది ఏమైనా ఏ టీం గెలిచిన క్రికెట్ ప్రేమికులు మాత్రం ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని ఆస్వాదిస్తారు అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే రోజురోజుకీ భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత రూపం కావడంతో సీజన్ మొదలైతే అవుతుంది కానీ.

, మళ్ళీ క్యాన్సల్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో క్రికెట్ అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.

బాబు వల్ల అవ్వాతాతలకు పెన్షన్ కష్టాలు.. పండుటాకులను ఇంతలా ఇబ్బంది పెట్టాలా?