వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా..!

ఏప్రిల్ 9 నుండి ఐపిఎల్ 14వ సీజన్ మొదలవనుంది.కేవలం సీజన్ మొదలవడానికి ఆరు రోజులు మాత్రమే ఉండగా ఇలాంటి టైం లో ముంబై వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా రావడం షాక్ ఇచ్చింది.

స్టేడియంలో పనిచేస్తున్న 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.వారందరికి ఐసోలేషన్ లో ఉంచారు.

అయితే షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది.

ఇప్పుడు ఆ మ్యాచ్ ను జరిపించాలా లేదా క్యాన్సిల్ చేయాలా అన్న ఆలోచనలో ఉంది బిసిసిఐ.

కరోనా తీవ్రత మళ్లీ ఉదృతంగా అవుతున్న కారణంగా ఈ సీజన్ ఐపిఎల్ ను కేవలం 6 వేదికల్లోనే నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.

చెన్నై, ముంబై, కోలకత్తా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్ షెడ్యూల్స్ ఏర్పాటు చేశారు.

ఈ సీజన్ లో ఎనిమిది ప్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్ లేకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆరు వేదికల్లోనే ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి.

అయితే వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పుడు అక్కడ కూడా మ్యాచ్ లు జరిగే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

అయితే దీనిపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా అరెస్టు చేస్తారా… తెలంగాణ పోలీసులను ప్రశ్నించిన వర్మ!