SBI అందిస్తున్న ఈ స్కీమ్ తెలిస్తే… అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు!
TeluguStop.com
భారత ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) దేశ వ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.
ఈ క్రమంలోనే SBI తన కస్టమర్ల కోసం అనేక రకాల స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ స్కీమ్స్ ద్వారా వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు.కాగా తాజాగా SBI మరొక FD స్కీమ్ ఒకదానిని అందుబాటులోకి తీసుకువచ్చింది మీకోసం.
ఈ స్కీం ద్వారా కస్టమర్లు అధిక వడ్డీ బెనిఫిట్స్ పొందే అవకాశం మెండుగా కలదు.
ఎస్బిఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త స్కీం టెన్యూర్, వడ్డీ రేటు గురించి పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.
"""/" /
SBI కనిష్టంగా 400 రోజుల టెన్యూర్‌తో కస్టమర్ల కోసం కొత్త FD స్కీమ్‌ను తీసుకువచ్చింది.
ఫిబ్రవరి 15 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.కానీ దీని గురించి చాలా మందికి తెలియదు.
అయితే ఈ స్కీమ్ 2023 మార్చి 31తో క్లోజ్ అయిపోతుందని తాజాగా SBI వెల్లడించింది.
ఈ FD స్కీమ్‌లో చేరిన కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
అదే సీనియర్ సిటిజన్లయితే 7.6 మేర వడ్డీ రేట్లు పొందవచ్చు.
తాజాగా FD రేట్లు 5 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి.
ఇక మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉన్న టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.
25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది.
"""/" /
ఇకపోతే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు చూసుకుంటే టెన్యూర్‌లోని FDలపై కూడా వడ్డీ రేటు 7.
25 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది.
అంతే కాకుండా సీనియర్ సిటిజన్స్ కోసం ఉయ్ కేర్ డిపాజిట్ పథాకాన్ని SBI ప్రవేశపెట్టింది.
అంతేకాకుండా 50బేసిస్ పాయింట్లను కూడా సొంతం చేసుకోవచ్చు.RBI రెపోరేటు పెరగటంతో హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
RBI రెపో రేటు పెరగడం వల్ల అన్ని బ్యాంకులు కూడా రుణ రేట్లు, ఎఫ్‌డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి.
ఇప్పుడు SBI కూడా ఈ బ్యాంకుల జాబితాలోకి చేరి వడ్డీ రేట్లు, FD రేట్లు పెంచింది.
తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన వెంకటేశ్.. అన్ స్టాపబుల్ ప్రోమోలో ఆ సీక్రెట్స్ రివీల్!