స్వర్ణ ప్యాలెస్ ఘటన పై విచారణ కమిటీ నివేదిక..ఏముందంటే!

ఏపీ విజయవాడ లోని కోవిడ్ సెంటర్ అయిన స్వర్ణ ప్యాలెస్ ఘటన లో విచారణ కమిటీ ఏపీ సర్కార్ కు తమ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తుంది.

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం అన్ని నియమాలను ఉల్లఘించింది అని, వైద్య విలువలను సైతం నీరు గార్చి ప్రవర్తించింది అని ఆ నివేదిక లో వెల్లడైనట్లు తెలుస్తుంది.

కోవిడ్ నిబంధనలను తుంగలోకి తొక్కి కనీసం ప్రభుత్వ అనుమతి కూడా లేకుండా అక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహించారంటూ నివేదికలో వెల్లడైంది.

కనీసం మున్సిపల్ కార్పొరేషన్ కూడా పన్నులు సైతం చెల్లించలేదంటూ విచారణ కమిటీ ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదిక ను అందించింది.

కొద్దీ రోజుల క్రితం విజయవాడ లోని రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా,కొందరు గాయాలతో బయటపడగలిగారు.అయితే ఎలాంటి నియమ,నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ అనుమతి కూడా లేకుండా అక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు రావడం తో ఈ ఘటనపై ఏపీ సర్కార్ విచారణ కమిటీ ని ఏర్పాటు చేసింది.

"""/"/ ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి రాయపాటి కోడలు మమత ను కూడా పోలీసులు విచారించగా, ప్రస్తుతం రమేష్ హాస్పటల్ చైర్మన్ రమేష్ మాత్రం ఇప్పటివరకు పోలీసుల విచారణకు హాజరుకాలేదు.

ఈ ఘటన పై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా స్పందిస్తూ సోషల్ మీడియా లో ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్..: ఎమ్మెల్యే కడియం శ్రీహరి