చంద్రబాబు బెయిల్ పై కండిషన్లు పెట్టాలన్న సీఐడీ పిటిషన్ పై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై మరో ఐదు కండిషన్లు పెట్టాలన్న సీఐడీ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయనున్నారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పై ఐదు షరతులు పెట్టాలంటూ నిన్న మధ్యాహ్నం సీఐడీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ జరగగా ఇందులో రెండు అంశాలపై ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి వరకు చంద్రబాబు ఎటువంటి రాజకీయ ర్యాలీలు నిర్వహించరాదని కోర్టు తెలిపింది.

అదేవిధంగా ఎటువంటి స్పీచ్ లు ఇవ్వొద్దని, స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై మీడియాతో మాట్లాడవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం మిగతా షరతులపై ఇవాళ విచారణ చేస్తామన్న హైకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మరికాసేపటిలో షరతులపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!