అంగన్వాడి సెంటర్లో సిడిపిఓ ఉమారాణి విచారణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో సి.
ఓ గుర్రం ఉమారాణి విచారణ జరిపారు.ఇటీవలే అంగన్వాడి సెంటర్లో కోడిగుడ్లు పిల్లలకు ఇవ్వనందుకు బెస్త నరేష్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా జాయింట్ కలెక్టర్ ఖిమ్యా నాయక్ విచారణ చేపట్టాలని డి.
డబ్ల్యు.ఓ పోచంపల్లి లక్ష్మీరాజంకు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమారాణి నీరటి భవానికి మెమో జారీ చేస్తూ నేడు అంగన్వాడి సెంటర్ కు చేరుకొని
టీచర్ భవాని ని విద్యార్థి తండ్రి నరేష్ సమక్షంలో విచారించగా పిల్లలకు కోడిగుడ్లు పెట్టనందుకు నరేష్ పైన లైంగిక వేధింపుల కేసు పెడతానని, తన ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం తప్పుగా భావించి ఇచ్చిన మేమో కు సమాధానం ఇవ్వాలని తెలిపారు,భవాని పొంతన లేని సమాధానము ఇవ్వడంతో సిడిపిఓ అసంతృప్తితో సెంటర్ నుంచి వెళ్లిపోయారు.
మరల మరొక మేమో జారీ చేస్తామని తెలిపారు.
అబ్బా, ఈ పులి ఎంత క్యూట్‌గా ఉందో.. పిక్స్ చూస్తే..!!