గొర్రెల పంపిణీ స్కాంలో దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కాం కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ అంజిలప్పతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

ఇందులో భాగంగా అంజిలప్ప నివాసంలో రూ.9 లక్షల నగదుతో పాటు అరకిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే అంజిలప్పకు సంబంధించిన బ్యాంకు లాకర్లను ఏసీబీ గుర్తించింది.సోదాల అనంతరం అంజిలప్ప, కృష్ణయ్యలను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా ఏసీబీ కస్టడీ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.

ఇండియన్ ఫ్యామిలీపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అమెరికన్ మహిళ.. వీడియో వైరల్..