సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది:- ఏసీపీ ఆంజనేయులు
TeluguStop.com
మృతుడు సామినేని
సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఖమ్మం టౌన్ ఏసీపీ అంజనేయులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మృతుడు సామినేని సాయిగణేష్ @ సాయి చౌదరి 26సం,, పై ఖమ్మం డివిజన్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో 08 కేసుల్లో నిందుతుడుగా వున్నాడని ఖమ్మం టౌన్ ఏసీపి వివరాలు వెల్లడించారు.
ఓ రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ మజ్దూర్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా వున్న ఇతనిపై 2019 నుండి ఇప్పటివరకు చట్టవ్యతిరేక చర్యలతో నగరంలో అలజడి సృష్టించి ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తునట్లు పలు నేరాలపై అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని పెర్కొన్నారు.
అదేవిధంగా ఇటీవల ఖమ్మం నగరంలోని చర్చి కంపౌండ్ మతపరమైన సున్నిత ఆంశలలో అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఇతనిపై ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయిందని తెలిపారు.
ఇతని చట్టవ్యతిరేక కార్యకాలపాలపై నిఘా పెట్టేందుకు ఈ ఏడాది జనవరి 5 వ తేదీన రౌడీ షీట్ ఒపెన్ చేయడం జరిగిందని తెలిపారు.
పలు కేసుల్లో నిందుతుడిగా సాయి గణేష్ ఏప్రియల్ 14 పురుగు మందు తాగి ఖాళీ డబ్బతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ విధినిర్వహణలో పోలీస్ సిబ్బంది వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు పురుగు మందు తాగినట్లు ఖాళీ డబ్బ చూపడంతో అప్రమత్తమైన మహిళ కానిస్టేబుల్ ,మరో హెడ్ కానిస్టేబుల్ హూటహూటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారని, మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఆరోగ్య ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
కండిషన్ సిరియస్ వుండటంతో హైదరాబాదు యశోద ఆసుపత్రికి తరలించారని,అక్కడ చికిత్స పొందుతూ.ఏప్రియల్ 16 తేదీన మృతి చెందారని వివరించారు.
తీరు మార్చని టీమిండియా బ్యాటర్స్.. 150 పరుగులకే ఆలౌట్