నవీన్ హత్య కేసుపై రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ
TeluguStop.com
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై కోర్టులో విచారణ జరిగింది.
ఈ మేరకు నిందితుడు హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్ పై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచారించింది.
ఈ నేపథ్యంలో నిందితుడు హరిహరకృష్ణ కస్టడీపై కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది.అయితే ప్రియురాలి కోసం నవీన్ ను హరిహరకృష్ణ ప్లాన్ ప్రకారం హత్య చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బెంగళూరు వ్యక్తి జీనియస్ ఐడియా.. ట్రాఫిక్‌లోనే తెలివిగా మీటింగ్స్..?