బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. పలువురికి నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది.

ఈ క్రమంలో పలువురికి పోలీసులు నోటీసులు అందించారు.రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ ఓనర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ క్రమంలో జీఆర్ ఫామ్ హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి( Gopal Reddy ) నోటీసులు అందజేశారని తెలుస్తోంది.

విచారణకు హాజరు కావాలని సీసీబీ నోటీసులు జారీ చేశారు.కాగా రేవ్ పార్టీ వ్యవహారంలో గోపాల్ రెడ్డి ఏ6గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

దేశానికి ఏం సేవ చేశాడు : నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ నివాళిపై భారత సంతతి ఎంపీ అసంతృప్తి