ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
TeluguStop.com
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
ఐఆర్ఆర్ అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే ఈ పిటిషన్ పై హైకోర్టు ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలను వినింది.
ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్న న్యాయస్థానం వాదనలు విననుంది.అలాగే మరోవైపు చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.
ఈ పిటిషన్ పై ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలను వినిపించనున్నారని తెలుస్తోంది.
ట్రంప్ ఆ ప్లాన్ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!