ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ ఆవిష్కరణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత( Financial Literacy ) పై అవగాహన కల్పించడానికి ఆర్బీఐ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti ) ఆవిష్కరించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ఆర్బీఐ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్, బ్యాంక్, వివిధ శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు.
/BR ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ దాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank Of India ) ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం’ దృష్ట్యా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ వీరాంజనేయులు, యూబీఐ చీఫ్ మేనేజర్ ప్రేమ్‌కుమార్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ లోవరాజు, లీడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సెలర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న దేవర… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?