పోలీస్ ఆఫీసర్ గా ఒకప్పటి స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.

ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.అలాగే రెమ్యునరేషన్ పెంచినా కూడా ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.

ఈ సినిమాను జులై 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు మేకర్స్.

ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్న విషయం విదితమే.

అయితే తాజాగా ఈయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.

"""/" / ఇందులో వేణు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.సిఐ మురళి గా నటిస్తున్న ఈయన ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.

ఈ గెటప్ లో వేణు పవర్ ఫుల్ అండ్ చార్మింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

దీంతో ఎంట్రీ నే పవర్ ఫుల్ రోల్ లో వస్తుండడంతో వేణు పాత్రపై సాలిడ్ బజ్ ఏర్పడింది.

నేను పిల్లల్ని కనకపోవడానికి అసలు కారణాలివే.. వరుణ్ సందేశ్ భార్య కామెంట్స్ వైరల్!