నితిన్, సుధాకర్ రెడ్డి, శ్రేష్ట్ మూవీస్ 'మాచర్ల నియోజకవర్గం'నుండి రాజప్పగా సముద్రఖని లుక్ విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

ఈ చిత్రం నుండి బయటికి వస్తున్న ప్రొమోషనల్ కంటెంట్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.

తాజాగా ఈ సినిమాలో విలన్ ని పరిచయం చేసింది చిత్ర యూనిట్.''మాచర్ల నియోజకవర్గం' నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్ప పాత్రలో కనిపించబోతున్నారు విలక్షణ నటుడు సముద్రఖని.

మాచర్ల నియోజకవర్గంలో రాజప్పకు ప్రతిపక్షమే లేదు.నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదిటిన తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్ లో కనిపించిన సముద్రఖని పేపర్‌లపై సంతకం చేస్తూ సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్స్ చూడటం చాలా క్యురియాసిటీని పెంచింది.

ఐఏఎస్ అధికారిగా నితిన్, ఎమ్మెల్యే మధ్య పోరు ఇందులో ఆసక్తికరంగా వుండబోతుంది.'మాచర్ల నియోజకవర్గం' భారీ ప్రమోషన్‌లు, ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది.

ఇటీవల విడుదలైన ''రా రా రెడ్డి'' పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంటూ, ఇటీవలి కాలంలో బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

నితిన్, అంజలిల మాస్ డ్యాన్స్‌లు అందరినీ అలరిస్తున్నాయి.శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా ఈ చిత్రంలో కథానాయికలు.

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.

ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు.

H3 Class=subheader-styleతారాగణం:/h3p నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, అంజలి (స్పెషల్ సాంగ్) తదితరులు H3 Class=subheader-styleసాంకేతిక విభాగం :/h3p రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి, నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల , సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ : మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు, పీఆర్వో: వంశీ-శేఖర్ .

రాజమౌళి మహేష్ బాబు సినిమా ఓపెనింగ్ కి వస్తున్న స్టార్ హీరో…