32 ఏళ్ల తర్వాత కలిసిన పేగుబంధం..!

సోషల్ మీడియా ద్వారా 32 సంవత్సరాల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు కొడుకు.

దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఉన్న సంఘం అధ్యక్షుడు నాగ శరణం తల్లి పద్మావతి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తతో గొడవపడి 32 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లి పోయింది.

అలా వెళ్లిన ఆవిడ ఎన్ని రోజులు రాజమహేంద్రవరం లో ఉన్న షాపులు వద్ద పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.

అయితే తల్లి ఆచూకీ కోసం కొడుకు ఇన్ని రోజులు చేయని ప్రయత్నం లేదు.

ఎన్ని చోట్ల వెతికిన ఆయనకు ఫలితం దక్కలేదు.ఇకపోతే తాజాగా రాజమహేంద్ర పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు దర్యాప్తు నిమిత్తం లాలాచెరువు లో నివసిస్తున్న 70ఏళ్ల పద్మావతి వారి కంటపడింది.

ఆవిడ పరిస్థితిని గమనించిన వారు ఆవిడ నుంచి వివరాలు సేకరించారు.చాలా సంవత్సరాల క్రితం తాను భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు ఆవిడ అందులో తెలిపింది.

దీంతో పోలీసులు పద్మావతి వివరాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం దానికి ఎవరు స్పందించలేదు.

అలా ఆ పోస్ట్ చేసిన సంవత్సరం రోజులకు దాని రిమైండర్ ఫేస్బుక్ లో రావడంతో ఈనెల మరోసారి పోలీస్ కానిస్టేబుల్ రీ పోస్ట్ చేయగా ప్రొద్దుటూరు నగరానికి చెందిన రమేష్ దాన్ని చూసి తన లోకల్ గ్రూపులో షేర్ చేశాడు.

దీంతో ఆవిడ కుమారుడు నాగశయనం ఆ పోస్టు చూడగా తన భార్యతో కలిసి రాజమహేంద్ర వెళ్లి తన తల్లి ని కలిశాడు.

దాదాపు 32 సంవత్సరాల తర్వాత తల్లి కొడుకు కలుసుకున్న తర్వాత ఒకరిని ఒకరు చూసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఆ సందర్భంగా తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు పద్మావతిని ఆమె కుమారుడికి అప్పగించారు.

తల్లి పద్మావతి ఇల్లు వదిలి వచ్చే సమయానికి నాగశయనం కు వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే.

పద్మావతికి కేవలం ఒక కొడుకు మాత్రమే కాదు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు.

దీంతో తల్లిని కలిసిన తర్వాత కుమారుడితో కలిసి ఆవిడ ప్రొద్దుటూరు పట్టణానికి చేరుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తోంది.

మైగ్రేన్ తలనొప్పిని తరిమికొట్టే టాప్ అండ్ బెస్ట్ డ్రింక్స్ ఇవే!