బల్బ్‌లతో ఇంటర్‌నెట్ సేవలు.. హ్యాకింగ్‌కు ఆస్కారమే ఉండదంటున్న నిపుణులు

టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.

ఎప్పటిప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంది.అందులో భాగంగా తాజాగా మరో అద్బుత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

లైఫై అనే కొత్త టెక్నాలజీ( Technology ) వచ్చింది.దీని వల్ల వైఫై కంటే అధిక ప్రయోజనాలు ఉన్నాయి.

రేడియో వేవ్స్ తో సమాచారం పంపించడాన్ని వైఫై అంటారు.అదే కాంతి తరంగాలతో సమాచారాన్ని పంపించడాన్ని లైఫై అని పిలుస్తారు.

దీని ద్వారా ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. """/" / ఇక లైఫై వల్ల హ్యాకింగ్ బెడద కూడా తప్పుతుంది.

అలాగే వేగవంతమైన ఇంటర్నెట్ లైఫై ద్వారా పొందవచ్చు.లైఫైకు 800 నుంచి 100 ఎన్‌ఎమ్ వేవ్‌లెన్త్ గల కాంతి తరంగాల అవసరం ఉంటుంది.

10 ఎమ్‌బీపీఎస్ నుంచి 9.6 జీబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందవచ్చు.

ఎల్‌ఈడీ బల్బులు, లేసర్ డయోడ్, సిలికాన్ ఫొటో డయోడ్( Silicon Photo Diode ) వంటి వాటితో ఈజీగా లైఫైని మనం ఏర్పాటు చేసుకోవచ్చు.

దీనిని హ్యాకింగ్ చేయడం కూడా సాధ్యం కాదు.వైఫైని హ్యాక్ చేయడం చాలా సులువు.

కానీ లైఫైలో అసాధ్యమని చెప్పవచ్చు. """/" / వైఫైలో ఎన్ని పాస్‌వర్డ్‌( Password )లు పెట్టుకున్నా హ్యాకింగ్ చేస్తూ ఉంటారు.

దీంతో మనం ఎన్ని పాస్‌వర్డ్‌లు మార్చుకున్నా లాభం ఉండదు.వైఫైని హ్యాక్ చేసి మీ వ్యక్తిగత డేటాను చోరీ చేసే అవకాశం ఉంటుంది.

అయితే లైఫై అనే నూతన సాంకేతికతో మీకు ఎలాంటి భయం ఉండదు.దీంతో ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ సంచలనంగా మారింది.

ఇప్పట్లో ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.దీంతో ప్రతిఒక్కరూ ఇంటర్నెట్ అనేది వాడుతున్నారు.

ఇంటర్నెట్ లేకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతున్నారు.అందుకే పబ్లిక్ ప్లేస్ లలో కూాడా ఇంటర్నెట్ అందుబాటులో వచ్చింది.

ఫ్రీగా ఇంటర్నెట్ లభిస్తుండటంతో వినియోగం కూడా పెరిగిపోయింది.

అమెరికాలో వలసదారుల ఆగడాలు.. మహిళపై అత్యాచారం, తనను చంపేస్తాడంటూ బాధితురాలి ఆవేదన