వాట్సాప్ ను టార్గెట్ చేస్తున్న ఇంటర్నేషనల్ స్పామ్ కాల్స్.. జాగ్రత..!
TeluguStop.com
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్స్అప్( WhatsApp ) యాప్ ను ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల దృష్టి ఈ వాట్సప్ పై పడింది.గత కొన్ని రోజులుగా వాట్సాప్ లో వినియోగదారులకు అంతర్జాతీయ నెంబర్ల నుండి అనుమానస్పద స్పామ్ కాల్స్ వస్తున్నాయి.
కేవలం యూట్యూబ్లో వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్ షాట్లను పంపడం ద్వారా నగదుతో పాటు బహుమతులు గెల్చుకోవచ్చు అంటూ ఆసక్తికర మెసేజ్లను పంపించి నిలువు దోపిడీ పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
తాజాగా ఈ అనుమానస్పద స్పామ్ కాల్స్ పై వాట్సాప్ స్పందిస్తూ.ఇటువంటి కాల్స్ ను ఆపేందుకు అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది.
ఇందుకోసం స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని( Spam Detection Technology ) ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరించేందుకు భారత్లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది.
వాట్సప్ వినియోగదారులు స్పామ్ కాల్స్ లేదా ఇతర ఫిర్యాదులు ఏమైనా ఉంటే తమకు సంప్రదించవచ్చునని సూచించింది.
"""/" / వాట్సాప్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను, వాటిపై వాట్సప్ తీసుకున్న చర్యలను కూడా వినియోగదారులు తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా ఇటువంటి స్పామ్ కాల్స్ నుండి రక్షణ పొందడం కోసం వాట్సాప్ లో ఉండే టూ- స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ రిపోర్ట్ గోప్యత నియంత్రాల వంటి భద్రత సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం స్టే సేఫ్ విత్ వాట్సాప్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.
"""/" /
వాట్సాప్ లో ఎక్కువగా వస్తున్న స్పాం కాల్స్ లో +251 ( ఇథియోపియా), +60(మలేషియా), +62( ఇండోనేషియా), +254(కెన్యా), +84( వియత్నాం) తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్లనుండి వస్తున్నాయని వాట్సాప్ తెలిపింది.
తెలంగాణ సైబరాబాద్ పోలీసులు( Telangana ) ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వాట్స్అప్ యూజర్లకు హెచ్చరిస్తున్నారు.
వాట్సాప్ లో ఇటువంటి అంతర్జాతీయ నెంబర్లను వచ్చే కాల్స్ ను ఎటువంటి పరిస్థితులో స్పందించవద్దని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.