హైదరాబాద్‎కు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్‌ కు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.పచ్చదనం పెంపుపై వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతో పాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డును సొంతం చేసుకుంది.

ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్‌ నగరానికి వరల్డ్‌ సిటీ గ్రీన్‌ అవార్డును ప్రదానం చేశారు.

కాగా , భారత్‌ నుంచి అవార్డును అందుకొన్న ఒకే ఒక నగరం హైదరాబాద్‌ కావడం విశేషం.