బర్త్ డే నాడే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగు పెట్టిన టీమిండియా ప్లేయర్లు ఎవరో తెలుసా?

ప్రతి ఒక్కరు తమ తమ జన్మదినాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటారు.కొంత మంది తమ పుట్టిన రోజు నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

చాలా ముఖ్యమైన పనులను కూడా ఆరోజే ప్రారంభిస్తారు.ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరి బర్త్ డే వారికి ఎంతో స్పెషల్.

అలాంటి తమ తమ బర్త్ డే రోజే దేశంలో మస్త్ క్రేజ్ ఉన్న క్రికెట్ లోకి అరంగేట్రం చేయడం అంటే మస్త్ మజా ఉంటుంది.

కొందరు క్రికెటర్లు తమ బర్త్ డే రోజే టీమిండియా తరఫున అంతర్జాయతీయ మ్యాచ్ లు ఆడి తమ జీవితంలో మర్చిపోని అనుభూతిని పొందారు.

మరికొందరు ఆటగాళ్లు తమ బర్త్ డే రోజునే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు.

మరికొంత మంది తమ బర్త్ డే రోజునే సెంచరీలు చేశారు.ఇంకొందరు తమ పుట్టిన రోజు నాడే రిటైర్మెంట్ కూడా ప్రకటించారు.

తమ బర్త్ డే రోజునే భారత్ తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడటం అంటే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

ఇంతకీ తమ పుట్టిన రోజు నాడు అంతర్జాతీయ మ్యాచ్ కోసం మైదానంలోకి దిగిన టీమిండియా ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బర్త్ డే నాడే ఇంటర్నేషనల్ మ్యాచ్ ల ద్వారా క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన వారిలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు.

వారిలో ఒకరు గుల్ శరణ్ సింగ్.మరొకరు ఇషాన్ కిషన్.

H3 Class=subheader-styleగుల్ శ‌ర‌ణ్ సింగ్/h3p """/"/ టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు గుల్ శరణ్ సింగ్.

పలు టెస్టు మ్యాచుల్లో ఆడాడు.అయితే తన బర్త్ డే నాడే గుల్ శరణ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.

రిటైర్మెంట్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ టీమ్ లకు కోచ్ గా బాధ్యతలు నిర్వహించాడు.

H3 Class=subheader-styleఇషాన్ కిష‌న్/h3p """/"/ బీహార్ యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా తన బర్త్ డే రోజునే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.

అనతి కాలంలోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్25, మంగళవారం 2024