పెద్దపల్లి బీజేపీలో రోడ్డెక్కిన అంతర్గత విభేదాలు..!!

పెద్దపల్లి బీజేపీలో( Peddapalli BJP ) అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి.పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాస్( Srinivas ) నామినేషన్ ర్యాలీలో పార్టీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని సమాచారం.

అది కాస్తా ముదరడంతో ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.దీంతో నామినేషన్ ర్యాలీలో( Nomination Rally ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ముందుగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిపై( Sunil Reddy ) గుజ్జుల రామకృష్ణా రెడ్డి( Gujjula Ramakrishna Reddy ) వర్గం దాడికి ప్రయత్నించింది.

అయితే వారి దాడిని సునీల్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గీయులకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ప్రొడ్యూసర్లు గా మారుతున్న మన స్టార్ డైరెక్టర్ల భార్యలు…