చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. పండగ చేస్కోంటున్న తమ్ముళ్లు కానీ..!?

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన ఇవాళ సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలకానున్నారు.చంద్రబాబు విడుదల అవుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు పండగ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ఓ వైపు టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటుండగా మరోవైపు చంద్రబాబు లేకపోతే నెల రోజుల పాటు జైలుకు విరామం వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.

చంద్రబాబు జైలుకు వెళ్లడంతో దాదాపు 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ కథ ముగిసిందా ? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగిందనే చెప్పుకోవచ్చు.

చంద్రబాబు లేకపోవడంతో పార్టీకి సరైన నాయకత్వమే లేదు.పార్టీని గాడిన పెట్టి నడిపే వారే లేకపోయారట.

ప్రధానులను, రాష్ట్రపతులతో పాటు శాస్త్రవేత్తలను సైతం మేమే తయారు చేశామంటూ పబ్బం గడిపిన చంద్రబాబుకు ఈ అరెస్ట్ అవమానకరమని ఏపీ ప్రజలు చెబుతున్నారు.

అయితే చేసిన పాపానికే శిక్ష అనుభవించాల్సిందేనని మరికొందరు చెబుతున్నారని తెలుస్తోంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో దాదాపు 52 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఇన్నేళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పబ్బం గడిపిన చంద్రబాబు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కారని ఏపీ వాసులు కొందరు అంటున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు జైలుకు వెళ్లిన మొదటి రోజు నుంచే కొందరు టీడీపీ నేతలు డ్రామాలకు తెర తీశారు.

ఆయనకు జైలులో సెక్యూరిటీ లేదని, ప్రాణహానీ ఉందని ఇలా పలు వార్తలను జోరుగా ప్రచారం చేశారు.

తరువాత చర్మ సంబంధ సమస్యలు ఉన్నాయని, తాజాగా కంటి సమస్య అంటూ ప్రచారం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా అసత్య ప్రచారాలు చేశారని పలువురు చెబుతున్నారు.

ఏదీ ఏమైనా చంద్రబాబుకు బెయిల్ వచ్చింది.అయితే ఏపీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ కేసు మెరిట్స్ పై రాలేదు.

అనారోగ్య సమస్యల దృష్ట్యా కోర్టు చంద్రబాబుకు షరతులతో విధిస్తూ నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

అరెస్ట్ అయిన రోజు నుంచి తనపై నమోదు చేసిన కొట్టేయాలంటూ చంద్రబాబు న్యాయస్థానాల ముందు పెట్టుకున్న పలు అర్జీలు ఫలితాలను ఇవ్వలేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం కావడంతో కళ్లు బాగా లేవని, చికిత్స అవసరం అని కోర్టు ఎదుట ఆయన తరపు లాయర్లు వాపోయారు.

దీంతో కళ్లు కూడా బాలేకపోతే ఎలా అని సానుభూతితో న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందని వార్త ప్రస్తుతం జోరందుకుందని తెలుస్తోంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రూ.374 కోట్లను దోచుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు.

అంతేకాదు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు మద్యం కేసుల్లో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారని సీఐడీ చెబుతోంది.

కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందన్న న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అనంతరం తిరిగి నవంబర్ 28న సరెండర్ కావాలన్న కోర్టు బెయిల్ మంజూరుకు షరతులు విధించింది.

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి ఎక్కడ మాట్లాడకూడదని హైకోర్టు తెలిపింది.

రాజకీయ కార్యకలాపాలకు హాజరు కావొద్దని, కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించింది.

కేసు మెరిట్స్ పై కాకుండా కేవలం అనారోగ్య సమస్యల కారణంగా మంజూరు చేసిన బెయిల్ కావున ఆయన ఇల్లు లేదా ఆస్పత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే కోర్టు చంద్రబాబుకు అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

బెయిల్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించుకుంటున్నారు.దీనిపై ఏపీలోని కొందరు స్పందిస్తూ ఆయన కేసు అలానే ఉందని టీడీపీ క్యాడర్ ఏదో గొప్పగా సాధించామన్న రీతిలో ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.

నిజం గెలిచి ఆయనకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఎటువంటి పాత్ర లేదని ఎక్కడా తేల లేదన్నారు.

కేవలం వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఇబ్బంది ఉన్న నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం.

మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!